Asianet News TeluguAsianet News Telugu

లండన్ లో భారతీయ సంతతి యువతి హత్య.. ట్యునీషియా జాతీయుడి అరెస్ట్..

లండన్ లో తానుంటున హాస్టల్ లో ఓ భారతీయ సంతతి యువతి హత్యకు గురయ్యింది. ఆమె మీద ఓ వ్యక్తి దాడి చేసి హత్య చేశాడు. అతను ట్యునీషియన్ జాతీయుడని పోలీసులు తేల్చారు. హత్య జరిగిన మరుసటి రోజు అదే ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. 

Indian Origin Woman Murdered In Student Flat In London, Tunisian National Arrested
Author
Hyderabad, First Published Mar 21, 2022, 1:34 PM IST

లండన్ : లండన్‌లోని Indian-Originకి చెందిన బ్రిటిష్ విద్యార్థిని murderకు గురయ్యింది. వసతి గృహంలో ఉన్నstudentపై ఓ వ్యక్తి attackచేసి హత్య చేశాడు. ఈ కేసులో అనుమానితుడిగా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు Tunisian Nationalని అరెస్టు చేసింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. లండన్‌లోని క్లర్కెన్‌వెల్ ప్రాంతంలోని ఆర్బర్ హౌస్ విద్యార్థి ఫ్లాట్‌లో 19 ఏళ్ల బ్రిటీష్ జాతీయురాలు సబితా తన్వానీ మెడపై తీవ్ర గాయాలతో కనిపించింది.

మెట్రోపాలిటన్ పోలీసులు 22 ఏళ్ల వ్యక్తి మహేర్ మారూఫ్ కోసం urgent appealని జారీ చేశారు, అతనికి హతురాలు తన్వానీతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని చెప్పారు. హతురాలి మృతదేహం కనిపెట్టిన మరుసటి రోజు  ఆదివారంనాడు హత్యజరిగిన క్లర్కెన్‌వెల్‌లోని అదే ప్రాంతంలో వాంటెడ్ నిందితుడిని అధికారులు అరెస్టు చేశారు.

"Maaroufeని కనుగొనడానికి మేము చేసిన అప్పీల్ ను ప్రచారం చేసి.. అతడిని కనిపెట్టడానికి సాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని ఈ కేసు విచారణకు నాయకత్వం వహిస్తున్న మెట్ పోలీస్ స్పెషలిస్ట్ క్రైమ్ విభాగానికి చెందిన డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ లిండా బ్రాడ్లీ అన్నారు.

“ఈ వివరాలు సబిత కుటుంబానికి అందించాం. వారికి మా అధికారుల మద్దతును కొనసాగుతుంది. వారికి మా ప్రగాఢ సానుభూతి. సబిత హత్య విషయాన్ని వారు బాధాతప్త హృదయాలతో అంగీకరించారు. వారు ప్రస్తుతం చాలా విషాదంలో ఉన్నంతున వారి గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం ” అని ఆమె చెప్పింది. అంతకు ముందే కేసు ఇంకా పెండింగులో ఉన్నా.. తన్వానీ కుటుంబానికి ప్రత్యేక పోస్ట్‌మార్టం పరీక్షను నిర్ణీత సమయంలో ఏర్పాటు చేయనున్నట్లు మెట్ పోలీసులు తెలిపారు.

"మరూఫ్ సబితాతో రిలేషన్ లో ఉన్నాడు. అతను విద్యార్థి కాదు. అతనికి సరైన అడ్రస్ లేదు. ట్యునీషియా జాతీయుడు”అని డిటెక్టివ్ బ్రాడ్లీ ఈ కేసులో పబ్లిక్ అప్పీల్‌లో భాగంగా తెలిపారు. అనుమానితుడికి నేరుగా చేసిన అప్పీల్‌లో, ఆమె ఇలా చెప్పింది: “మహెర్ మారూఫ్‌ను వెంటనే పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మహర్ – నేను మీకు నేరుగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను: మీకు ఇది కనిపిస్తే, దయచేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లండి. మేము మీతో మాట్లాడటం చాలా ముఖ్యం” అని అప్పీల్ చేశారు. తన్వానీ సిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో చదువుతోంది. శుక్రవారం నాడు మారుఫేతో కలిసి ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది.

ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున మేము దాని గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నాం అని అర్బోర్ హౌస్ విద్యార్థి వసతిని నిర్వహించే యునైట్ స్టూడెంట్స్ ప్రతినిధి చెప్పారు. అంతేకాదు “ఈ సమయంలో మా ప్రాధాన్యత ఆర్బర్ హౌస్‌లోని విద్యార్థుల భద్రత, శ్రేయస్సు’ అని.. ‘ఈ కేసు దర్యాప్తుకు మేము పోలీసులు,  సిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్‌తో కలిసి పని చేస్తున్నాం”అని ప్రతినిధి చెప్పారు. "యూనివర్సిటీగా, మా విద్యార్థులు, సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి మేం చేయగలిగినదంతా చేస్తాం, వారి విచారణలో పోలీసులకు పూర్తిగా మద్దతునిస్తాం" అని విశ్వవిద్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios