భారత సంతతికి చెందిన ఓ టెక్కీ.... సొంత ఇంట్లోనే కిడ్నాప్ కి గురయ్యాడు. ఆ తర్వాత కారులో శవమై కనిపించాడు. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

భారత సంతతికి చెందిన తుషార్ ఆత్రే(50) .. అమెరికాలో  స్థిరపడ్డారు. అతను అక్కడ మిలీనియర్ గా గుర్తింపు పొందాడు. ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఆత్రే నెట్ కి తుషార్ అధినేత.  కాగా... మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కాలిఫోర్నియా శాంటా క్రూజ్ లోని  అతని ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు.

ఆ తర్వాత ఓ బీఎండబ్ల్యూ కారులో శవమై కనిపించాడు. చివరిసరిగా అతను తెలుపు రంగు బిఎండబ్ల్యూ కారులో ఎక్కుతూ సీసీటీవీ కెమేరాలో కనిపించారు. సముద్రానికి సమీపంలో ఉన్న తన విలాసవంతమతైన నివాసం నుంచి అతనిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అతని కారును పోలీసులు కొండ ప్రాంతాల్లో ఉండటాన్ని గమనించారు.అందులోనే ఆయన శవంగా కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.