పబ్ లో జరిగిన దాడిలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా...చనిపోయిన విద్యార్థి భారత సంతతికి చెందినవాడు కావడం గమనార్హం. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. అయితే.... విద్యార్థి మృతి కారణమైన యువకుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే భారత సంతతికి చెందిన అర్జున్ సింగ్(20) లండన్ లో స్థిరపడ్డాడు. అతను ప్రస్తుతం నాటింగమ్ ట్రెంట్ యూనివర్శిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. శనివారం అర్జున్ సింగ్ సమీపంలోని ఓ పబ్ కి వెళ్లగా... అక్కడ మరో యువకుడితో గొడవ జరిగింది. ఈ ఘటనలో అర్జున్ సింగ్ పై మరో యువకుడు తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.. తీవ్రంగా గాయపడిన అర్జున్ ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.... అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచాడు.

Also Read గత నెలలో అదృశ్యమైన మహిళ కారులో శవమై తేలింది...

అర్జున్ ప్రాణాలు కోల్పోవడం పట్ల అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా... అర్జున్ మరణ వార్త విని యూనివర్శిటీ విద్యార్థులు,  ప్రొఫెసర్లంతా షాక్ కి గురయ్యారు. కాగా... అర్జున్ హత్య కేసులో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని... అతని వయసు కూడా 20ఏళ్లేనని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.