సింగపూర్ లో ప్రతిపక్ష నేతగా భారతీయుడు
సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ నాయకత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ 83స్థానాల్లో గెలుచుకుంది. కాగా.. పీపుల్స్ యాక్షన్ పార్టీ ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
సింగపూర్ లో ఓ భారతీయుడు చరిత్ర సృష్టించాడు. సింగపూర్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా భారతసంతతికి చెందిన వర్కర్స్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రీతం సింగ్‌ను నియమించారు. సింగపూర్ చరిత్రలో ప్రతిపక్ష నేతను నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాగా.. సింగపూర్ లో జూలై 10న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ 10స్థానాల్లో గెలిచింది. కాగా.. ప్రీతమ్ సింగ్ వర్కర్స్ పార్టీకి సెక్రటరీ జనరల్ గా వ్యవహరించారు. కాగా.. సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ నాయకత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ 83స్థానాల్లో గెలుచుకుంది. కాగా.. పీపుల్స్ యాక్షన్ పార్టీ ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే... ఇప్పటి వరకు సింగపూర్ శాసనసభలు అధికారికంగా ప్రతిపక్ష నాయకులను నియమించలేదు, అటువంటి స్థానం రాజ్యాంగంలో లేదా పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్లలో ఇవ్వలేదని పార్లమెంటరీ కార్యాలయాలు మంగళవారం తన ప్రకటనలో తెలిపాయి. తొలిసారిగా ఆ ఘనత భారతీయుడికి దక్కడం గమనార్హం.