సూట్ కేసులో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి శవం: బాయ్ ఫ్రెండ్ పనే..
ప్రీతిరెడ్డి బాయ్ ఫ్రెండ్ హర్ష్ నర్దే సోమవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి మరణించాడు. ప్రీతిరెడ్డి హత్యతో అతనికి సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
మెల్బోర్న్: గత కొద్ది రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయిన భారత సంతతికి చెందిన డెంటిస్టు ప్రీతిరెడ్డి శవమై తేలింది. ఆమె కారు కింగ్స్ ఫోర్డులోని వీధిలో పార్క్ చేసి ఉండడాన్ని పోలీసులు కనిపెట్టారు. కారులో ఆమె శవమై తేలింది. ప్రీతిరెడ్డి స్వస్థలం తెలంగాణ రాజధాని హైదరాబాదు.
ప్రీతిరెడ్డి బాయ్ ఫ్రెండ్ హర్ష్ నర్దే సోమవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి మరణించాడు. ప్రీతిరెడ్డి హత్యతో అతనికి సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సూట్ కేసులో ఉన్న విగతజీవిగా పడి ఉన్న ప్రీతిరెడ్డి దేహంపై పలు చోట్ల కత్తిగాట్లు కనిపించాయి.
తన సహచర డెంటిస్టు హర్ష్ నర్దేతో కలిసి ప్రీతిరెడ్డి సిడ్నీలోని సిబిడీ మార్కెట్ స్ట్రీట్ లోని హోటల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
భారత సంతతికి చెందిన 32 ఏళ్ల డెంటిస్టు ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయి శవమై తేలింది. సిడ్నీలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆమె తప్పిపోయినట్లు భావిస్తున్నారు. ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు.
ప్రీతిరెడ్డి ఆదివారం ఉదయం 2.15 గంటలకు జార్జి స్ట్రీట్ లోని మెక్ డోనాల్డ్స్ వద్ద క్యూలో నిలబడి ఉండడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆమె రక్షణను తాము తీవ్రంగా తీసుకుంటున్నట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసు మహిళా అధికార ప్రతినిధి అన్నారు.
తాము తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాయమని, ఆమె అదృశ్యమైనప్పటి నుంచి తమకు నిద్ర కూడా కరువైందని ఆమెతో పాటు పనిచేసేవారు అంటున్నారు.
ప్రీతిరెడ్డి వారాంతంలో సెయింట్ లియోనార్డ్స్ లో జరిగిన డెంటల్ సదస్సుకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో చివరిసారి ఆదివారం ఉదయం 11 గంటలకు మాట్లాడారు. సిడ్నీలో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఆమె ఇంటికి వెళ్లలేదు.