అమెరికాలో భారత సంతతి సీఈవో హత్య.. డబ్బు కోసం, 80 కిలోమీటర్లు వెంటాడి మరి

అమెరికాలో (america) భారత సంతతి (indian origin) సీఈవో (ceo) దారుణహత్యకు గురయ్యారు. క్యాసినో (casino) నుంచి ఇంటివరకు 80 కిలోమీటర్లు మేర బాధితుడిని వెంబడించిన దుండగుడు డబ్బు కోసం ఆయనను కాల్చిచంపాడు

indian origin ceo shot dead in usa

అమెరికాలో (america) భారత సంతతి (indian origin) సీఈవో (ceo) దారుణహత్యకు గురయ్యారు. క్యాసినో (casino) నుంచి ఇంటివరకు 80 కిలోమీటర్లు మేర బాధితుడిని వెంబడించిన దుండగుడు డబ్బు కోసం ఆయనను కాల్చిచంపాడు. గత మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. న్యూజెర్సీలోని (new jersey) ప్లెయిన్స్‌బోరోలో (plainsboro) నివాసం ఉంటున్న శ్రీరంగ అరవపల్లి (sree Ranga Aravapalli) (54) ... 2014 నుంచి ఆరెక్స్‌ లేబరేటరీస్‌ (arex laboratories) సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఫిలడెల్ఫియాలోని (philadelphia) క్యాసినోలో మంగళవారం తెల్లవారుజామున 10 వేల డాలర్లు గెలుచుకుని ఇంటికి బయలుదేరాడు. అక్కడ దీనిని గమనించిన రీడ్ జాన్ అనే దుండగుడు.. ఆ సొమ్ము కోసం అతన్ని కారులో రహస్యంగా వెంబడించాడు. న్యూజెర్సీలో ఇంటికి చేరుకున్నాక శ్రీరంగపై కాల్పులు జరిపి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అమెరికాలో వున్న భారతీయ సమాజం దిగ్భ్రాంతికి గురైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios