Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో సాహస బాలుడిగా నిలిచిన తెలుగు కుర్రాడు

స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోతున్న 34ఏళ్ల వ్యక్తిని.. ఓ 11ఏళ్ల కుర్రాడు.. ధైర్య సాహసాలతో ముందుకు సాగి.. రక్షించాడు.

indian origin brave kid adventure in america
Author
Hyderabad, First Published Jan 9, 2019, 11:24 AM IST


స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోతున్న 34ఏళ్ల వ్యక్తిని.. ఓ 11ఏళ్ల కుర్రాడు.. ధైర్య సాహసాలతో ముందుకు సాగి.. రక్షించాడు. ఈ సంఘటన అమెరికాలో ని ఈగన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా.. అతని సాహాసానికి మెచ్చిన అమెరికా పోలీసులు  ఆ బాలుడి పేరుని ‘‘లైఫ్ సేవింగ్ అవార్డు’’ కోసం సిఫారసు చేశారు. ఆ కుర్రాడు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడు కావడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా నందికొట్కూరు కి చెందిన రఘు ఎన్.నటరాజ్, లలిత దంపతులు మూడేళ్ల క్రితం ఉద్యోగరిత్యా అమెరికాలోని ఈగన్‌కు వెళ్లి..అక్కడున్న ఆక్వా టాట్స్‌ ప్రాంతంలోని టౌన్‌ సెంటర్‌ అపార్ట్‌మెంట్‌ హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.

అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న బంధువులను చూసేందుకు డిసెంబర్‌లో శ్రీనివాస్ 34) అనే వ్యక్తి వచ్చాడు. అక్కడే ఉన్న ఇండోర్‌ స్విమ్మింగ్‌పూల్‌లో  ఈత కొట్టేందుకు నోటిలోకి దిగాడు.  అయితదే.. ఈత రాక అతను మునిగిపోతుండటాన్ని చూసిన రఘు నటరాజ్‌ కుమారుడు అద్వైక్‌ ఎన్‌. విశ్వామిత్ర(11) స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకి 8 అడుగుల లోతులో మునిగిపోయి ఉన్న శ్రీనివాస్ ని బయటకు తీసుకొచ్చాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios