బొమ్మలు, చాక్లెట్స్ ఆశచూసి..ప్రియురాలికి తెలీకుండా.. ఓ మైనర్ బాలికను వసపరుచుకున్నాడో యువకుడు. తీరా ఈ విషయాన్ని పసిగట్టిన ప్రియురాలు.. తన బాయ్ ఫ్రెండ్ కి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ సంఘటన సింగపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన దక్షిణామూర్తి అనే యువకుడు సింగపూర్ లో సెటిల్ అయ్యాడు. అక్కడ ఒక మినిమార్ట్ లో దక్షిణామూర్తి పనిచేసేవాడు. ఆ షాక్.. ఓ మైనర్ బాలిక రెగ్యులర్ గా వెళ్లేంది. ఆ బాలికపై కన్నేసిన దక్షిణామూర్తి.. ఆమెకు చాక్లెట్లు, బొమ్మలు ఆశచూసి వశపరుచుకున్నాడు. మైనర్ బాలికతో రోజూ షికారుకు వెళ్లేవాడు. దాదాపు నెలరోజులపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఇద్దరి వ్యవహారంపై ఎవరైనా అనుమానపడితే.. ఆ బాలిక తన భార్య అని చెప్పేవాడు. ఆ బాలిక మాత్రం అతను తనకు అంకుల్ అంటూ చెప్పేది. కాగా.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో బాలికతో తిరగడాన్ని దక్షిణామూర్తి గర్ల్ ఫ్రెండ్ గమనించింది. అతని ఫోన్ చెక్ చేయగా.. బాలిక నగ్న చిత్రాలు ఉన్నాయి. అంతే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన 2016లో చోటుచేసుకోగా.. అక్కడి న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. నిందితుడు దక్షిణామూర్తికి 13ఏళ్ల జైలు శిక్ష, 12 కొరడా దెబ్బలు శిక్షగా విధించింది.