Asianet News TeluguAsianet News Telugu

అత్యాచారం, హత్య కేసు.. బ్రిటన్ లో భారతీయుడికి జీవిత ఖైదు

అతనిని భారత్ నుంచి బ్రిటన్ కి  ఇటీవల రప్పించారు. అనంతరం ఆయన నేరాలు నిరూపితం కావడంతో.. శిక్ష ఖరారు చేసినట్లు న్యాయస్థానం పేర్కొంది.

Indian Man Extradited To UK Sent To Life In Jail On Rape, Murder Charges
Author
Hyderabad, First Published Aug 21, 2020, 11:30 AM IST

బ్రిటన్ లో ఓ భారతీయుడికి అక్కడి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. భారత్ కి చెందిన వేదవ్యాస్(36) అనే వ్యక్తి పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశాడు. ఈ కేసులో అతను ధోషి అని తేలడంతో.. న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

కాగా.. అమన్ వ్యాస్.. దాదాపు ముగ్గురు మహిళలపై దారుణానికి పాల్పడ్డాడు. కాగా.. మూడు దారుణ హత్యలు  చేసిన తర్వాత అతను భారత్ కి పారిపోవడం గమనార్హం. కాగా.. అతనిని భారత్ నుంచి బ్రిటన్ కి  ఇటీవల రప్పించారు. అనంతరం ఆయన నేరాలు నిరూపితం కావడంతో.. శిక్ష ఖరారు చేసినట్లు న్యాయస్థానం పేర్కొంది.

ఈ మూడు హత్యలు వేదవ్యాస్ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. దాదాపు పది సంవత్సరాల క్రితం అతను ఈ దారుణాలకు పాల్పడటం గమనార్హం. ఓ మహిళపై అత్యాచారం చేసినందుకు 14 సంవత్సరాలు, మరో మహిళలపై అత్యాచారం చేసినందుకు 16 సంవత్సరాలు , మరో మహిళపై అత్యాచారం చేసినందుకు 18 సవత్సరాలు శిక్ష విధిస్తున్నట్లు చెప్పారు.

నేరస్థుడు ఈ నేరాలు 2009 లో పాల్పడటం గమనార్హం. కాగా ఆ సమయంలో అతని వయసు 24 కాగా.. ఇప్పటికి అతనికి శిక్ష పడింది. కాగా.. నేరస్థుడికి శిక్ష పడటం పట్ల బాధితుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

2009లో హత్యలు చేసిన వేదవ్యాస్.. తర్వాత అక్కడి నుంచి న్యూజిలాండ్ పారిపోయాడు. ఆ తర్వాత సింగపూర్ లో కొంతకాలం ఉన్నాడు. అక్కడి నుంచి భారత్ కి పారిపోగా.. ఢిల్లీలో పోలీసులు అతనిని పట్టుకొని.. బ్రిటన్ పోలీసులకు అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios