అత్యాచారం చేసి పారిపోయిన ఎన్ఆర్ఐ ... హెడ్ ఫోన్స్ ఆధారంగా అరెస్ట్
ఒంటరిగా వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇస్తానంటూ కారు ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారేమోననే భయంతో ఇండియా పారిపోయాడు.
ఒంటరిగా వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇస్తానంటూ కారు ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారేమోననే భయంతో ఇండియా పారిపోయాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ నుంచి తన మకాం స్పెయిన్ కి మార్చేశాడు. కానీ చివరికి అతని హెడ్ ఫోన్స్ అతనిని పట్టించాయి. పోలీసులు అతనిని అరెస్ట్ చేయగా... న్యాయస్థానం అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన అజయ్ రాణా(35) అనే వ్యక్తి ఇంగ్లండ్ లో ఉద్యోగరిత్యా నివసించేవాడు. కాగా.. 2017లో ఒక రోజు కారులో వెళ్తు.. అక్కడి స్థానిక మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు. కారులో ఆమెను ఎవరూలేని ప్రాంతానికి తీసుకువెళ్లి... బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహ కోల్పోయిన యువతిని అక్కడే వదిలేసి తన నివాసానికి వెళ్లిపోయాడు.
అనంతరం ఇండియాలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం బాలేదంటూ... వెంటనే ఇండియాకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన మకాంని స్పెయిన్ కి మార్చేశాడు. కాగా.. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతను వాడిన ఇయర్ ఫోన్స్ స్వాబ్స్‌లో లభించిన డీఎన్‌ఏతో.. బాధితురాలి శరీరం నుంచి సేకరించిన డీఎన్‌ఏ శాంపిల్స్ మ్యాచ్ అవడంతో.. అతడిని నిందితుడిగా నిర్ధారించారు. అజయ్‌పై యూరోపియన్ అరెస్టు వారెంట్ జారీ చేసి.. గత నవంబరులో స్పెయిన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కోర్టు అతడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.