Asianet News TeluguAsianet News Telugu

జాక్ పాట్ కొట్టిన ఎన్ఆర్ఐ.. 20కోట్ల లాటరీ గెలిచి..

ఈ డబ్బుతో దుబాయ్‌లో ఇల్లు కొనుక్కుని, పంజాబ్‌లో ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులను తీసుకువస్తానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పారు. 

Indian expat from Sharjah wins Dh10 million in Big Ticket raffle draw
Author
Hyderabad, First Published Sep 5, 2020, 7:31 AM IST

విదేశాల్లో ఉంటున్న ఓ ఎన్ఆర్ఐ కి జాక్ పాట్ తగిలింది. యూఏఈలోని ఉంటున్న భారతీయుడొకరు లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నారు. షార్జాలోని ఓ ఐటీ కంపెనీకి మేనేజర్‌గా పనిచేస్తున్న గుర్‌ప్రీత్‌ సింగ్‌(35) 10 మిలియన్‌ దిర్హామ్స్‌(సుమారు 19.90 కోట్లు) గెలుచుకున్నట్లు ఖలీజ్‌ టైమ్స్‌ తెలిపింది. పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్‌ ఆగస్టు 12వ తేదీన లాటరీ టికెట్‌ కొన్నారు. 

ఈ నెల 3వ తేదీన బిగ్‌ టికెట్‌ లాటరీ సంస్థ ప్రకటించిన ఫలితాల్లో గురుప్రీత్‌ సింగ్‌ జాక్‌పాట్‌ గెలుచుకున్నారు. రెండేళ్ల నుంచి బిగ్‌ టికెట్‌ లాటరీ టికెట్‌ కొనుగోలు చేస్తున్న గురుప్రీత్‌ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. ఈ డబ్బుతో దుబాయ్‌లో ఇల్లు కొనుక్కుని, పంజాబ్‌లో ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులను తీసుకువస్తానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios