లండన్‌ను తాకిని మోడీ డాక్యుమెంటరీ సెగ.. బీబీసీ కార్యాలయం ఎదుట ఎన్ఆర్ఐల ఆందోళన
ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌లోని బీజేపీ అనుకూల, వ్యతిరేక విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా లండన్‌లోని బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు
ప్రధాన మంత్రి మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై వివాదం చల్లారడం లేదు. బీబీసీపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. వివిధ పార్టీల నేతలు డాక్యుమెంటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లండన్‌లోని బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీకి అనుకూలంగా వున్న ప్లకార్డులను ప్రదర్శించారు. బీబీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీకి బీబీసీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాగా.. మహారాష్ట్రలోని ప్రముఖ కాలేజీ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో యాజమాన్యం హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేశారు. టిస్‌లో కొందరు విద్యార్థుల సమూహం ఒక దగ్గరకు చేరి బీబీసీ డాక్యుమెంటరీని వారి వారి ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లలో వీక్షించారు. బ్రిటన్‌కు చెందిన బీబీసీ.. గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీ పై ఓ డాక్యు సిరీస్ తీసింది. రెండు పార్టులతో వచ్చిన ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి దూరంగా ఉన్నదని, ఒక ప్రాపగాండ పీస్ అని కొట్టిపారేసింది. అంతేకాదు, ఈ డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా సైట్‌లు యూట్యూబ్, ట్విట్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
ALso Read: ఆంధ్రా యూనివర్సిటీని తాకిన మోడీ డాక్యుమెంటరీ సెగ.. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధుల మధ్య ఘర్షణ
ముంబయిలోని టిస్ క్యాంప్ సహా దాని బ్రాంచీల్లోనూ మాస్ ఈవెంట్ నిర్వహించకూడదని విద్యార్థులకు అడ్వైజరీలు విడుదల చేసింది. ఈ అడ్వైజరీని పాటించకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేసింది. బీబీసీ స్క్రీనింగ్ చేయడం అంటే విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నమే అని వార్నింగ్ ఇచ్చింది. క్యాంపస్ వెలుపల ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు నిరసనలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఒక చోట గుమిగూడవద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొందరు వెళ్లిపోయారు.