అమెరికాలో భారతీయ దంపతుల మృతి.. లోయలో పడి..

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 30, Oct 2018, 11:31 AM IST
Indian couple dies after falling 800 ft in California's Yosemite National Park
Highlights

సరదాగా పార్క్ కి వెళ్లి.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది ఓ భారతీయ జంట

సరదాగా పార్క్ కి వెళ్లి.. ప్రమాదవశాత్తు  అమెరికాలో ప్రాణాలు కోల్పోయింది ఓ భారతీయ జంట. అమెరికాలోని కాలిఫోర్నియా యోసిమైట్ నేషనల్ పార్కులో  ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  భారతీయ దంపతులు విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షీ మూర్తి (30)లు కొంతకాలంగా అమెరికాలో నివసిస్తున్నారు. కాగా విష్ణుకు ఇటీవలే సిస్కోలో సిస్టమ్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. 

దీంతో అప్పటివరకూ న్యూయార్క్ లో నివాసం ఉన్న వీరు, శాన్ జోస్ కు కాపురం మార్చారు. ట్రావెలింగ్, అడ్వెంచర్స్ చేయడంలో ఆసక్తి చూపే ఈ జంట ఆదివారం నాడు పార్క్ కు వచ్చింది. ఈ క్రమంలో వారు లోయను చూస్తున్న వేళ, ఇద్దరూ ప్రమాదవశాత్తు  లోయలో పడిపోయారు. దాదాపు 800 అడుగుల లోతు లోయలోకి పడిపోయారు.  సోమవారం నాడు వీరి మృతదేహాలను బయటకు తీసిన అధికారులు, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న విషయమై విచారిస్తున్నామని తెలిపారు. వీరికి 2014లో వివాహం జరిగిందని, ఇద్దరూ ప్రతిభావంతులైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని, వీరి మరణం దురదృష్టకరమని అన్నారు.

loader