అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీనియర్ సలహాదారుగా భారత సంతతి మహిళ..

అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండియన్ అమెరికన్ కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది.అగ్రరాజ్యం అదినేత  జో బైడెన్ బృందంలో సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్ నియమితులయ్యారు. 

Indian-American Neera Tanden to serve as senior adviser to US President Joe Biden - bsb

అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండియన్ అమెరికన్ కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది.అగ్రరాజ్యం అదినేత  జో బైడెన్ బృందంలో సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్ నియమితులయ్యారు. 

ఈ విషయాన్ని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. జో బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ నియమితులయ్యారు. నీరా తెలివితేటలు, చిత్తశుద్ధి, రాజకీయ అవగాహన బిడెన్ పరిపాలనకు ఒక ఆస్తి అవుతుంది. అని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ వ్యవస్థాపకుడు జాన్  పొడెస్తా ఓ ప్రకటనలో తెలిపారు. 

అంతేకాకుండా సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ సాధించే విజయాలను చూసేందుకు ఎదురు చూస్తున్నట్టుగా పేర్కొన్నారు. కాగా మేనేజ్మెంట్ అండ్బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నీరా టాండన్ ను అమెరికా అధ్యక్షుడు గతంలో నామినేట్ చేశారు.

అయితే గతంలో పలువురు నేతలపై చేసిన పక్షపాత ట్వీట్ల కారణంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఆమె తన నామినేషన్ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో జో బైడెన్ సీనియర్ సలహాదారులుగా నీరా టాండన్ నియమితులయ్యారు. 

ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కు కూడా నీరా టాండన్ గతంలో సలహాదారుగా పనిచేశారు. జో బైడెన్ బృందంలో ఇప్పటికే ఎంతోమంది భారతీయ మూలాలున్న వ్యక్తులు అరుదైన, కీలక పదువులు దక్కిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios