బైడెన్ పాలసీ డైరెక్టర్ గా భారతీయ మహిళ
ఇలియనాస్ రాష్ట్రానికి చెందిన అడిగ.. గ్రిన్నెల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వృత్తి రీత్యా ఆమె లాయర్. చికాగోలోని ఓ న్యాయ కంపెనీలో ఆమె క్లర్క్ గా చేశారు. 2008లో ఒబామా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తన ఉద్యోగాన్ని మార్చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు పాలసీ డైరక్టర్‌గా భారతీయ సంతతి మహిళ నియమితురాలైంది. ఇలియనాస్ రాష్ట్రానికి చెందిన మాలా అడిగా.. ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌కు ఇక నుంచి సలహాదారుగా ఉంటారు. ఎన్నికల ప్రచార వేళ.. జిల్ బైడెన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా అడిగా పనిచేశారు. గతంలో బైడెన్ ఫౌండేషన్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ మిలిటరీ ఫామిలీస్‌కు డైరక్టర్‌గా యూడా అడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన సమయంలోనూ.. మాలా అడిగ కీలక పదవులు చేపట్టారు. ఒబామా ప్రభుత్వ సమయంలో ఎడ్యుకేషనల్, కల్చరల్ అఫైర్స్ బ్యూరోకు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా మాలా అడిగా చేశారు ఇలియనాస్ రాష్ట్రానికి చెందిన అడిగ.. గ్రిన్నెల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వృత్తి రీత్యా ఆమె లాయర్. చికాగోలోని ఓ న్యాయ కంపెనీలో ఆమె క్లర్క్ గా చేశారు. 2008లో ఒబామా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తన ఉద్యోగాన్ని మార్చేశారు.
ఇల్లినాయిస్‌కు చెందిన మాలా.. గ్రిన్నెల్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆమె.. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఒబామా అధికారంలోకి వచ్చిన తర్వాత అసోసియేట్ అటార్నీ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగానూ బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు.