అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే
అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తున్న వానిని గుర్తించడానికి ప్రభుత్వం నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. 2015లో ఏర్పాటైన యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు.

ఈ క్రమంలో విద్యార్థులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వారిని ఇక్కడ నివసించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న పలువురిపై నిఘా పెట్టారు. ఈ ఆపరేషన్‌లో 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించిన 8 మంది తెలుగువారిని గుర్తించారు.
దీంతో 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారంలో గురువారం ఉదయం 20 మంది తెలుగువారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. వీరంతా మాస్టర్స్ చేసి హెచ్1బీ కోసం వెయిట్ చేస్తున్నవారే.
అక్రమాలకు పాల్పడిన తెలుగువారు:
* భరత్ కాకిరెడ్డి , లేక్ మేరీ (ప్లోరిడా)
* అశ్వంత్ నూనె, అట్లాంటా
* సురేశ్ రెడ్డి కందాల, వర్జీనియా
* ఫణిదీప్ కర్నాటి, లూసివిల్లె, (కెంటుకీ)
* ప్రేమ్ కుమార్ రామ్‌పీసా, చార్లెట్, (నార్త్ అమెరికా)
* సంతోష్ రెడ్డి సామా, ఫ్రెమాంట్, (కాలిఫోర్నీయా)
* అవినాశ్ తక్కెళ్లపల్లి, హర్రీస్‌బర్గ్ (పెన్సుల్వేనియా)
* నవీన్ ప్రత్తిపాటి, డల్లాస్