కత్తులతో దాడి: లండన్ లో హైదరాబాదీ హత్య
నజీముద్దీన్ ను టెస్కో సూపర్ మార్కెట్ లో పనిచేసే మరో వర్కరే హత్య చేసినట్లు భావిస్తున్నారు. నదీమ్ కుటుంబ సభ్యులు బుధవారంనాడు సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఫోన్ చేయడంతో హత్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: లండన్ లో ఓ హైదరాబాదీని దండుగుడు కత్తులతో దాడి చంపాడు. హంతకుడు ఆసియావాసిగా తెలుస్తోంది. హైదరాబాదులోని నూర్ ఖాన్ బజార్ కు చెందిన మొహమ్మద్ నదీముద్దీన్ అనే వ్యక్తిగా అతన్ని గుర్తించారు.
నదీముద్దీని లండన్ లోని టెస్కో సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. గత ఆరేళ్లుగా అతను లండన్ లో ఉంటున్నాడు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన భార్య గత నెలలోనే లండన్ వెళ్లింది.
నజీముద్దీన్ ను టెస్కో సూపర్ మార్కెట్ లో పనిచేసే మరో వర్కరే హత్య చేసినట్లు భావిస్తున్నారు. నదీమ్ కుటుంబ సభ్యులు బుధవారంనాడు సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఫోన్ చేయడంతో హత్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో నదీమ్ కుటుంబ సభ్యులు యాజమాన్యానికి ఫోన్ చేశారు. భవనం సెక్యురిటీతో కలిసి మార్కెట్ మేనేజర్ గాలింపు చేపట్టారు. భవనం సెల్లార్ పార్కింగ్ ఏరియాలో నదీమ్ హత్యకు గురై కనిపించాడు. ఆ విషయాన్ని నదీమ్ కుటుంబ సభ్యుడు ఫహీమ్ ఖురేషికి ఫోన్ చేసి చెప్పాడు.
పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడు నదీమ్ కు తెలిసినవాడే అయి ఉంటాడని వారు భాిస్తున్నారు. నదీమ్ మృతదేహాన్ని హైదరాబాదు తరలించడానికి సాయపడాల్సిందిగా ఖురేష్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను, తెలంగాణ హోం మంత్రి మహమూడ్ అలీని కోరారు.