నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత(22) అనే యువతి కొంతకాలం క్రితం ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి దుర్మరణం పాలయ్యింది. ఉన్న విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లగా.. అక్కడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత(22) అనే యువతి కొంతకాలం క్రితం ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అక్కడ రక్షిత ఎంఎస్ చదువుతోంది. అయితే.. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా.. రక్షిత తండ్రి వెంకటరెడ్డి ఆర్మీ విశ్రాంత ఉద్యోగి కావడం గమనార్హం. కూతురు మరణవార్త విని రక్షిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. త్వరలోనే ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.