హైదరాబాద్ విద్యార్థినిపై షికాగోలో లైంగిక దాడి, ఆపై హత్య
అమెరికాలోని షికాగో గల విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ విద్యార్థిని రూత్ జార్జ్ లైంగిక దాడికి, హత్యకు గురైంది. కారు వెనక సీట్లో ఆమె శవమై తేలింది. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
వాషింగ్టన్: అమెరికాలోని షికాగోలో భారత విద్యార్థి దారుణ హత్యకు గురైంది. ఆమపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలో ఈ సంఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకు గురైన విద్యార్థిని హైదరాబాదుకు చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్ గా గుర్తించారు.
ఇలినియోస్ విశ్వవిద్యాలయంలో రూత్ జార్జ్ చదువుతోంంది. క్యాంపస్ గ్యారేజీ యజమాని కుటుంబానికి చెందిన వాహనంలోని వెనక సీట్లో ఆమె శనివారంనాడు శవమైన కనిపించింది. దాడి చేసిన డోనాల్డ్ తుర్మాన్ (26)ను పోలీసులు ఆదివారం షికాగో మెట్రో స్టేషన్ లో అరెస్టు చేశారు సోమవారంనాడు నిందితుడిపై కోర్టులో అభియోగాలు మోపారు.
శుక్రవారం నుంచి రూత్ జార్జ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు శనివారంనాడు విశ్వవిద్యాలయం పోలీసులకు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశ్వవిద్యాలయంలోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. శనివారంనాడు డోనాల్డ్ తుర్మాన్ రూత్ జార్జ్ వెనక నడుస్తున్న దృశ్యాలు వాటిలో కనిపించాయి.
రూత్ జార్జ్ తెల్లవారుజామను 1.35 గంటలకు గ్యారేజీలోకి వెళ్లింది. ఆమె వెనుకే నిందితుడు కూడా వెళ్లాడు. ఆ తర్వాత తెల్లవారు జామున 2.10 గంటలకు నిందితుడు హాల్ స్టెడ్ స్ట్రీట్ లో నడుస్తూ కనిపించాడు.
పోలీసులు షికాగో ట్రాన్సిట్ అథారిటీ, షికాగో పీవోడీ కెమెరాలు, దాని ఇంటర్నల్ సిస్టమ్ ను పరిశీలించి నిందితుడి గురించి తెలుసుకునన్నారు. దాని ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. థుర్మాన్ గతంలో కూడా నేరాలు చేసినట్లు చెబుతున్నారు.