Asianet News TeluguAsianet News Telugu

హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

హౌడీ మోడీ ఈవెంట్ కు  సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. 

howdi modi: have alook at nri passes
Author
Houston, First Published Sep 21, 2019, 3:46 PM IST

ఈ నెల 22వ తేదీన, అనగా రేపు అమెరికా  టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది. 

గతఆదివారం  నాడు వైట్ హౌస్ ఒక ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా  ఈ సభకు హాజరవ్వనున్నట్టు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విట్టర్లో ఈ పరిణామాన్ని స్వాగతించాడు. ఇంత భారీ సంఖ్యలో  భారతీయ అమెరికన్లను ఒకే చోట ఉద్దేశించి ప్రసంగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెకార్డులకెక్కనున్నాడు. 

కాశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత దేశానికి మద్దతు పలుకుతుందని మరోమారు ఈ సభ ద్వారా చాటిచెప్పే ఛాన్స్ కూడా మనకు దక్కింది. మనమీద అవాకులు చెవాకులు పేలుతున్న అమెరికన్ డెమోక్రాట్లకు కూడా గట్టి సమాధానమిచ్చినట్టు అవుతుంది. 

ఈ హౌడీ మోడీ ఈవెంట్ కు  సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. 

Follow Us:
Download App:
  • android
  • ios