హరీశ్ చంద్ర పురీ అనే పూజారి జూలై 18న ఉదయం 11 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో 52 ఏళ్ల సెర్గియో గోవియో అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. ముఖంపై, శరీరంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ సమయంలో ‘‘ ఇది మా ప్రాంతం’’ అని సెర్గియో నినాదాలు చేశాడు. 

అమెరికాలో ఓ హిందూ పూజారిపై స్థానికుడు దాడికి పాల్పడ్డాడు. న్యూయార్క్ ఫ్లోరల్ పార్క్ సమీపంలోని గ్లెన్‌ఓక్స్‌ శివశక్తి పీఠం ఉంది. అక్కడికి దగ్గరలోని రోడ్డుపై హరీశ్ చంద్ర పురీ అనే పూజారి జూలై 18న ఉదయం 11 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ సమయంలో 52 ఏళ్ల సెర్గియో గోవియో అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. ముఖంపై, శరీరంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ సమయంలో ‘‘ ఇది మా ప్రాంతం’’ అని సెర్గియో నినాదాలు చేశాడు.

అమెరికన్ దాడిలో తీవ్రంగా గాయపడిన హరీశ్ ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెర్గియోను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు మహిళా సెనేటర్లపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.

ఈ దాడిని ప్రతినిధుల సభ్యురాలైన గ్రేస్ మెంగ్ ఖండించారు. దేశంలో మైనారిటీ వర్గాలుగా ఉన్న హిందువులకు తాను అండగా ఉంటానని... పలు దేశాల నుంచి వలస వచ్చిన అనేకమంది మైనారిటీలు తన నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉంటున్నారని మెంగ్ తెలిపారు.