లండన్ లో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు...పోస్టర్ లాంచ్ చేసిన కవిత
ఇంగ్లాండ్ లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆద్వర్యంలో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఉత్సవాలు అంఘరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలను లండన్ లో నిర్వహించడానికి టాక్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 20 వ తేదీన నిర్వహించనున్న "లండన్ - చేనేత బతుకమ్మ - దసరా " వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎంపీ కవిత ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం జరిపే వేడుకలకు "చేనేత బతుకమ్మ" గా నామకరణం చేసినట్లు టాక్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రవాసులల్లో చేనేతపై అవగాహన కలిపించి, చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలనే ప్రచారం చేయనున్నట్లు వివరించారు. గత సంవత్సరం "చేనేత బతుకమ్మ" వేడుకల ద్వారా సిరిసిల్ల చేనేత కార్మికులకు చేయూత అందించినట్లు టాక్ ప్రతినిధులు కవితకు వివరించారు.
చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహిస్తూ నేతన్నలను ఆదుకోవాలనే ప్రవాసుల ప్రయత్నాన్ని ఎంపి ప్రశంసించారు. వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మరింత మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ చేనేత బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మీడియాకు వివరించారు. అక్టోబర్ 20 వ తేదీన ఉదయం పది గంటల నుండి వెస్ట్ లండన్ లోని రిడ్జ్‌వే రోడ్డులో గల ఐసల్‌వర్త్ అండ్ సయాన్ స్కూల్ ఆడిటోరియం లో ఈ వేడుకలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఘనంగా ఈ వేడుకల్లో ప్రవాసులంతా చేనేత దుస్తులు ధరించి పాల్గొని చేనేతకు అండగా నిలవాలని సూచించారు. చేనేత వస్త్రాలకోసం www.tauk.org.uk వెబ్‌సైట్ ను సందర్శిస్తే వివరాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణలో కవితతో పాటు టాక్ ప్రతినిధులు మధుసుధన్ రెడ్డి, శ్వేతా, జాహ్నవి లు పాల్గొన్నారు. వీరితో పాటు జాగృతి రాష్ట్ర నాయకులు శరత్ రావు,రాజీవ్ సాగర్, ప్రణీత్ రావు, నవీన్ ఆచారి, సంతోష్ రావు కొండపల్లి, విజయ్ కోరబోయన తదితరులు కూడా పాల్గొన్నారు.