అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పుల కలకలం రేగింది. పాతబస్తీ లోని చంచల్ గూడ కు చెందిన సిరాజ్ అనే యువకుడిపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. డిసెంబర్ 4న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ కి చెందిన సిరాజ్.. ఉద్యోగ రిత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. డిసెంబర్ 4 తెల్లవారుజామున ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా.. డెవాన్ ఉత్తరాన అతని‌ కారుపై గుర్తు తెలియని షూటర్లు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ అతను సురక్షితంగా బయటపడ్డారు. కారు వెనుక సీటు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

ఈ సంఘటనలో కొన్ని ఆటోమేటిక్ గన్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాల్పుల విషయాన్ని విదేశాంగ మంత్రి, భారత ప్రభుత్వం, యుఎస్ఎలోని భారత రాయబారి, చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సిరాజ్‌ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా.. అతనిపై కాల్పులు ఎందుకు జరిపారు అనే విషయం మాత్రం తెలియలేదు.