అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది.. చికాగోలోని ఓ ఆస్పత్రిలోకి ప్రవేశించిన సాయుధుడైన దుండగుడు అక్కడి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.. ఈ కాల్పుల్లో ఓ అధికారితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆగంతకుడిని కాల్చి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.