Asianet News TeluguAsianet News Telugu

వర్కింగ్ వీసా ఇస్తామంటూ.. భారతీయులకు ఆస్ట్రేలియా ఆఫర్

ఆస్ట్రేలియాలోని వేర్వేరు ప్రాంతాల్లో నెలకొన్న కార్మిక కొరతను అధిగమించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

great move, australia's work and holiday visa to open for indians
Author
Hyderabad, First Published Aug 2, 2019, 2:48 PM IST

ఆస్ట్రేలియా ప్రభుత్వం... భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వల్ప కాలిక వ్యవధిలో ఆస్ట్రేలియాలో ఉపాధి పొందేందుకు వర్కింగ్ హాలిడే మేకర్ వీసాను ఆ దేశ ప్రభుత్వతం తీసుకువచ్చింది. ముఖ్యమంగా ఆ దేశంలో ఏర్పడ్డ వ్యవసాయ కార్మికుల కొరతను అధిగమించేందుకు ఈ వీసాలను ఇవ్వాలనుకుంటోంది.

ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ హాలిడే మంత్రి డేవిడ్ కోల్ మేన్ ఈ విషయాలను వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని వేర్వేరు ప్రాంతాల్లో నెలకొన్న కార్మిక కొరతను అధిగమించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

వర్కింగ్ హాలిడే మేకర్ కార్యక్రమంతో చేపట్టిన వర్కింగ్ హాలిడే, వర్క్ అండ్ హాలిడే వీసాలతో 13దేశాల నుంచి స్వల్పకాలిక వ్యవధిలో అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి కోల్ మేన్ వివరించారు. ఆస్ట్రేలియా ఆఫర్ చేసిన దేశాల్లో భారత్ తోపాటు బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్, ఫిజీ, సోలోమాన్ దీవులు, క్రోషియా, లాట్వియా, లూథియానా, అండొర్రా, మొనాకో, మంగోలియా దేశాలున్నాయి. ఈ దేశాల నుంచి తగిన ఉపాధి కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఈ వీసాలు పొందిన వారు ప్రభుత్వం చెప్పిన ప్రదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios