అమెరికాలోని భారతీయులకు శుభవార్త.. గడువు ముగిసిన వర్క్ పర్మిట్ల చెల్లుబాటు18నెలల పొడిగింపు...

అమెరికాలోని భారతీయులకు బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గడువు ముగిసిన వర్క్ పర్మిట్ల చెల్లబాటును 18నెలల పాటు పొడిగించింది. 

Good news for immigrants, US announces 1.5 years extension for some expiring work permits

వాషింగ్టన్ : americaలో పనిచేస్తున్న వలసదారులకు..  ముఖ్యంగా వేలమంది indiansకు శుభవార్త..  గడువు ముగిసిన కొన్నిరకాల వలసదారుల Work permits చెల్లుబాటు గడువును 18 నెలల పాటు పొడిగించాలని Biden యంత్రాంగం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ చెల్లుబాటు గడువు 180 రోజులు.  తాజా పెంపుతో ఇది 540 రోజులకు చేరుకుంది. బుధవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ ఉత్తర్వులు Green card కోసం నిరీక్షిస్తున్న వారికి, H1B వీసాదారుల భాగస్వాములకు  ఉపయోగపడునున్నాయి.

అమెరికా సంస్థల యజమానులకూ ఊరట నిచ్చేవే.  ఎందుకంటే వారికి ఉద్యోగ సేవలో ఎలాంటి అంతరాయం కలగదు. మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ Homeland సెక్యూరిటీ ఈ ఉత్తర్వులు వెలువరించింది. సాధారణంగా గడువు ముగిసిన వర్క్ పర్మిట్ లను 108 రోజులకు ఆటోమేటిక్గా పొడిగిస్తారు.  ఇప్పుడు దాన్ని 18 నెలలు చేశారు. 180 రోజులు పొడిగింపులో ఉన్నవారు మరో 360 రోజులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ నిర్ణయంతో  దాదాపు 80 వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ధి చేకూరడంతో పాటు దాదాపు 4.5 లక్షలమంది వలసదారులు పని అనుమతులు కోల్పోకుండా ఉంటారని అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ తెలిపారు.

ఇదిలా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల కోసం మార్చి1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రాథమిక స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతుందని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) జనవరి 30న  వెల్లడించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా నమోదు ప్రక్రియ పైన తెలిపిన తేదీల్లో పిటిషనర్లు, వారి ప్రతినిధులు పూర్తి చేసుకోవాలని ఆ ప్రకటనలో సూచించింది. సమర్పించిన ప్రతీ రిజిస్ట్రేషన్‌కు ఒక కన్ఫర్మేషన్ నెంబర్ ను అసైన్ చేస్తామని తెలిపింది. అయితే, ఆ నెంబర్ ద్వారా అధికారులు మాత్రమే ట్రాక్ చేయగలరని పేర్కొంది. ఆ నెంబర్‌ను ఇతరులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ట్రాక్ చేయడానిక ఉపయోగించలేరని స్పష్టం చేసింది. 

హెచ్-1బీ పిటిషనర్లు, లేదా వారి రిప్రజంటేటివ్‌లు మై యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాను వినియోగించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈ ఆన్‌లైన్ ఖాతా ద్వారా ప్రతి ఒక్క లబ్దిదారుడు సాంకేతికంగా సెలెక్షన్ ప్రాసెస్ కోసం నమోదు చేసుకోవాలని వివరించింది. ఇందుకు రిజిస్ట్రేషన్ రుసుము 10 అమెరికన్ డాలర్లు ఉంటుందని పేర్కొంది. వీసా కోసం దరఖాస్తులు సమర్పించే పిటిషనర్లు రిజిస్ట్రాంట్ ఖాతాలను ఉపయోగించి ఈ ప్రనక్రియకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 21వ తేదీ  మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రాంట్లు కొత్త అకౌంట్లను సృష్టించుకోవచ్చని వివరించింది. అమెరికా సంస్థల యాజమాన్యాలు, ఏజెంట్లను కలిపి సంయుక్తంగా రిజిస్ట్రాంట్లు అని పిలుస్తారు.

మార్చి 18వ తేదీ డెడ్‌లైన్ లోపు సరిపడా రిజిస్ట్రేషన్లు అందగానే.. తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తామని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. ర్యాండమ్‌గా సెలెక్షన్ ప్రక్రియ చేపడుతామని, ఆ సెలెక్షన్ నోటిఫికేషన్‌ను యూజర్లకు మైయూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ అకౌంట్ల ద్వారా తెలియజేస్తామని వివరించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios