తెలుగుదేశం పార్టీని ఎవరు ఏం చేయలేరన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు. అమెరికాలోని న్యూజెర్సీలో నాట్స్ మాజీ అధ్యక్షులు.. టీడీపీ ఎన్ఆర్ఐ సీనియర్ నేత మన్నవ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని తెలుగుదేశం కార్యకర్తల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆనంద్ బాబు మాట్లాడుతూ.. దేశంలోనే ఏపీని నెంబర్ వన్ చేయాలన్న సంకల్పం చంద్రబాబుదని.. ఆ ఉద్దేశ్యంతోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపారని స్పష్టం చేశారు.

బాబు నాయకత్వంలో ఎంతో సంతృప్తినిచ్చిందని.. ఎవరూ ఆందోళన చెందవద్దని.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో పార్టీ మరింత పురోగతి చెందేలా అందరం సమిష్టిగా కృషి చేద్దామని ఆనంద్ బాబు పిలుపునిచ్చారు.

మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐ తెలుగుదేశం కార్యకర్తలు చేసిన సేవల అమూల్యమైనవని.. శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా టీడీపీ పనిచేస్తోందని.. కార్యకర్తలను అన్నీ రకాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.