అమెరికాలోని మస్సాచుసెట్స్‌లో గురువారం రాత్రి గ్యాస్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గ్యాస్ లీకేజ్ కారణంగా ఒకదాని వెంట మరొక ఇంట్లో పేలుళ్లు సంభవించాయి.

అమెరికాలోని మస్సాచుసెట్స్‌లో గురువారం రాత్రి గ్యాస్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గ్యాస్ లీకేజ్ కారణంగా ఒకదాని వెంట మరొక ఇంట్లో పేలుళ్లు సంభవించాయి. సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.

సుమారు 50 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు 38 చోట్ల మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 10 అంబులెన్సులలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. తన జీవితంలో ఇలాంటి సంఘటనను ఎన్నడూ చూడలేదని ఒక అధికారి అన్నారు.