దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం, 17 మంది మృతి: మృతుల్లో 8 మంది భారతీయులు

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలవ్వగా.. వీరిలో 8 మంది భారతీయులు

Eight Indians killed in dubai road accident

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలవ్వగా.. వీరిలో 8 మంది భారతీయులు. వివరాల్లోకి వెళితే.. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి తిరిగి వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్‌ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

అతి వేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతి చెందిన వారిలో 8 మంది ఉన్నట్లు దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

మరణించిన వారిని రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మా ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీటిల్, కిరన్ జానీ, వాసుదేవ్, తిలక్‌రామ్ జవహార్ ఠాకూర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని, బాధితులకు అండగా ఉంటామని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios