Asianet News TeluguAsianet News Telugu

చీట్ చేసిన లవర్.. మతి స్థిమితం కోల్పోయిన యువకుడు.. పరాయి దేశంలో..

ఆమె లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. అయితే..  ఆ అమ్మాయి అతనిని దారుణంగా మోసం చేసింది. ఆ మోసాన్ని జీర్ణించుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు.

Dubai  Missing since Feb 2020, 'heartbroken' Indian youth flies home
Author
Hyderabad, First Published Jan 29, 2021, 2:05 PM IST

దేశం కాని దేశం వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమె ప్రాణంగా బతికాడు. ఆమె లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. అయితే..  ఆ అమ్మాయి అతనిని దారుణంగా మోసం చేసింది. ఆ మోసాన్ని జీర్ణించుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు.

దీంతో కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. వారి ప్రయత్నాలు ఫలించి.. చివరకు దుబాయ్ పోలీసులు, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఓ సామాజిక కార్యకర్త సహాయంతో స్వదేశానికి పయనమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నరేష్ కుమార్(27), 2018 నుంచి దుబాయ్‌లోని కేఫ్‌టేరియాలో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. అయితే, మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి అంటే 2020, మార్చి నుంచి అతను పత్తా లేకుండా పోయాడు.

 కుమారుడి నుంచి ఎలాంటి ఫోన్‌కాల్స్ రాకపోవడంతో ఎమయ్యాడో తెలియలేదు. అప్పటి నుంచి చాలా సార్లు కుటుంబ సభ్యులు నరేష్‌ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అయితే, నరేష్ తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతోనే మతిస్థిమితం కోల్పోయి.. ఎవరికీ తెలియకుండా ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లిపోవడం జరిగింది. చివరకు దుబాయి పోలీసులు, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, సామాజిక కార్యకర్త గీరిష్ పంత్ ఎంతో కష్టపడి అతని ఆచూకీ కనుగొన్నారు.  

వీరికి జనవరి 2న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆధారంగా నరేష్ ఆచూకీ దొరికింది. దాంతో నరేష్‌కు దుబాయ్‌లో సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్ చేయించారు. అనంతరం బుధవారం స్వదేశానికి పంపించారు. గతేడాది గర్ల్‌ఫ్రెండ్ దూరం కావడంతోనే నరేష్ ఇలా మానసికంగా కృంగిపోయినట్లు అధికారులు తెలిపారు. లవ్ బ్రేకప్‌ను తట్టుకోలేకపోయిన నరేష్ మతిస్థిమితం కోల్పోవడంతో బయటి ప్రపంచానికి దూరంగా నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉండిపోయినట్లు పేర్కొన్నారు. 

అతని కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం.. నరేష్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది ఆమెను విజిట్ వీసాపై దుబాయ్ తీసుకెళ్లాడు కూడా. కానీ ఆమె నరేష్‌కు బ్రేకప్ చెప్పడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు సామాజిక కార్యకర్త, ప్రవాసీ భారతీయ అవార్డు విజేత గీరిష్ పంత్ అన్నారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు కూడా కాంటాక్ట్‌లో లేకుండా పోయాడని ఆయన తెలిపారు. చివరకు సోషల్ మీడియా సహాయంతో కనుక్కోగలిగామని వారు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios