హెచ్ 1బీ వీసా ఉన్నవారికే సిటిజన్‌షిప్ తేలిక : ట్రంప్
తప్పనిసరిగా హెచ్-1బీ వీసాలో మార్పులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వీసా విధానంలో మార్పులు తేవడం వల్ల అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్1బీ వీసాల జారీ అంశాన్ని ప్రస్తావించారు.
తప్పనిసరిగా హెచ్-1బీ వీసాలో మార్పులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వీసా విధానంలో మార్పులు తేవడం వల్ల అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్1బీ వీసాల జారీ అంశాన్ని ప్రస్తావించారు. అత్యంత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ఈ వీసాలు అందేలా చేస్తామని ట్వీట్ చేశారు.
‘హెచ్ 1బీ వీసా విధానంలో త్వరలో మార్పులు చేయబోతున్నాం. దీని వల్ల వీసా విధానంలో సరళత్వం, కచ్చితత్వంతో పాటు పౌరసత్వం లభించేందుకు కూడా అవకాశం లభిస్తోంది. కెరీర్ కోసం అమెరికాను ఎంచుకునే ప్రతిభ, అత్యంత నైపుణ్యం ఉన్న ప్రజలను మేం ప్రోత్సహిస్తాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
హెచ్1 బీ వీసాతో అమెరికాలో ఉద్యోగాలు
అమెరికాల్లోని కంపెనీల్లో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు హెచ్-1బీ వీసా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారతీయులు ఈ వీసాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఏటా 65వేల హెచ్-1బీ వీసాలు జారీ చేయాలి.
17 నెలల కనిష్ఠానికి పారిశ్రామిక ఉత్పత్తి
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 17 నెలల కనిష్ఠానికి దిగజారింది. తయారీ రంగంలో ఒడుదొడుకులతో నవంబర్‌లో వృద్ధి 0.5 శాతంగా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా ఫ్యాక్టరీ ఔట్‌పుట్ 2017 నవంబర్‌లో 8.5 శాతం ఉందని కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. అంతకు ముందు కనిష్ఠ వృద్ధిరేటు 0.3 శాతం 2017 జూన్‌లో నమోదైంది. ఇక 2018 అక్టోబర్ వృద్ధిని 8.4 శాతం 8.1 శాతానికి సవరించారు.
ఏప్రిల్- నవంబర్ మధ్య పురోగతి
అంతకుముందు ఏడాది 3.2 శాతం పారిశ్రామిక ఉత్పత్తితో పోలిస్తే 2018 ఏప్రిల్-నవంబర్‌లో 5 శాతం వృద్ధి నమోదైంది. ఐఐపీలో 77.63 శాతం ఆక్రమించే ఉత్పాదక రంగం అంతకుముందు 10.4 శాతంతో పోలిస్తే నవంబర్‌లో 0.4 శాతం తగ్గింది. మైనింగ్ రంగం 2017 నవంబర్లో 1.4 శాతం వృద్ధితో ఉండగా 2018లో మాత్రం 2.7 శాతంతో దూసుకుపోయింది.
విద్యుత్ రంగంలో పురోగతి.. క్యాపిటల్ గూడ్స్‌లో తగ్గుదల
విద్యుత్ రంగం 3.9 శాతం నుంచి 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది. క్యాపిటల్ గూడ్స్ వృద్ధి 3.7 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గింది. ఎక్కువ కాలం మన్నికగా ఉండే వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి 3.1 శాతం నుంచి 0.9 శాతం తగ్గింది. మన్నిక లేని వస్తువుల ఉత్పత్తి 23.7 శాతం నుంచి 0.6 శాతం తగ్గింది. తయారీ రంగంలోని 23 పరిశ్రమల్లో 10 నవంబర్ (2018)లో సానుకూల వృద్ధి నమోదు చేయడం గమనార్హం.
సిటీ బ్యాంకుకు ఆర్బీఐ రూ.3 కోట్ల జరిమానా
అమెరికా ప్రధాన కేంద్రంగా సేవలు అందించే సిటీ బ్యాంకుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూ.3 కోట్లు జరిమానా విధించింది. సమర్థులైన డైరెక్టర్లను నియమించాలని, సరైన అర్హతలుండాలని ఆర్బీఐ గతంతో బ్యాంకును ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించక పోవడంతో బ్యాంకుకు జరిమానా విధించారు. వినియోగదారుల లావాదేవీలతో ఈ జరిమానాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
‘సిటీ బ్యాంకుకు 2019, జనవరి 3న ఆర్బీఐ రూ.3 కోట్లు జరిమానా విధించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు డైరెక్టర్ల నియామకంలో నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణం’ అని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అక్రమ నగదు చెలామణి, కేవైసీ ఉల్లంఘనలను సంబంధించి జులై 2013లోనూ సిటీబ్యాంకుకు ఆర్బీఐ హెచ్చరిస్తూ లేఖ రాసింది.