video: భారతీయ సంస్కృతి భళా...కెనడాలో ఘనంగా దీపావళి సంబరాలు

ఖండాలు దాటినా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మరిచిపోలేదని కెనడాలోని ఎన్నారైలు తన దీపావళి సంబరాల ద్వారా తెలియజేశారు. దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని అక్కడి భారత ప్రజలంతా కలిసి అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకున్నారు.  

diwali celebrations in canada (video)

భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలు ఖండాతరాలను దాటాయి. ఆదివారం భారతీయులంతా ఎంతో వైభవంగా జరుపుకున్న దీపావళి పండగ సంబరాలు విదేశాల్లో కూడా వైభవంగా జరుపుకున్నారు. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా వుండే దేశాల్లో ఈ పండగను ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. 

కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో భారత ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. ముఖ్యంగా  ప్రముఖ పట్టణమైన టొరంటోలో కొన్ని ప్రాంతాలకు వెళితే భారత్ లోనే వున్నామన్న ఫీలింగ్ వుంటుంది. అక్కడ ఎక్కడచూసిన భారతీయుల నివాసాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి చోట మన దేశీయ సంస్కృతి, సాంప్రదాయాలను ఫాలోఅయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగా వుంటుంది. 

ఈ క్రమంలోనే భారతీయులు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే దీపావళి పండగ టొరంటోలో  కూడా ఘనంగా జరిగింది.  ఖండాలు దాటినా దేశ సంస్కృతి సాంప్రదాయాలను వదిలేది లేదంటూ అక్కడి భారతీయులంతా కలిసి దీపావళి పండుగ ఆనందోత్సాహాలతో అట్టహాసంగా జరుపుకున్నారు.  భావి తరాలకు దీపావళి పండుగ విశిష్టత తెలియపర్చేలా పలు కార్యక్రమాలు నిర్వహించి, బాణాసంచా కాల్చి అలరించారు. 

మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవంతో టిడిఎప్ కెనడా మరియు డిడి రెడ్డి, జితేందర్ రెడ్డి సహకారంతో బ్రిచ్మోంట్ ఫ్రెండ్ క్లబ్ మరయు మినిస్టరి ఆఫ్ మమ్స్ ఆధ్వర్యంలో ఈ సంబరాలను నిర్వహించారు. కెనడాలోని భారతీయులందరిని ఏకం చేసి దీపావళి పండుగ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో చెతన్యం నింపి ఆనందోత్సాహాలతో అలరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios