అమెరికాలో మోదీ సభ... హాజరౌతానన్న ట్రంప్
సెప్టెంబరు 22న హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సుమారు 50వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. ప్రముఖ ఐటీ సంస్థ ఎక్స్‌పీడియన్ సీఈవో జితేన్ అగర్వాల్ ఈ సభ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. హోస్టల్ లో ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ జరగక పోవడం గమనార్హం.
అమెరికాలోని హోస్టన్‌లో జరగనున్న ‘హౌడీ మోదీ’ సభకు సన్నాహాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అమెరికాలోని ప్రవాసీలను ఉద్దేశించి భారత ప్రధాని ప్రసంగిస్తారు. తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను, తమ ఆలోచనలను ప్రవాసీలతో పంచుకుంటారు. కాగా.... అమెరికాలోని హోస్టన్ లో నిర్వహించే ఈ సభకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వెల్లడించారు.
డోనాల్డ్ ట్రంప్ తన సభకు వస్తానని చెప్పారని... ఆయన అలా చెప్పడం చాలా ఆనందంగా అనిపించిందని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సభకు తొలి అమెరికన్-హిందూ కాంగ్రెస్‌వుమెన్ తులసీ గబ్బార్డ్ కూడా హాజరవనున్నారు. ఆమే కాదు జాన్ కార్నీన్, టెడ్ క్రుజ్, అల్ గ్రీన్, పీటె ఓల్సన్, షీలా జాక్సన్ లీ, సిల్వియా గ్రేసియా, రాజా కృష్ణమూర్తి, న్యూయార్క్ గవర్నర్ ఎలియట్ ఎంజెల్ వంటి 60మంది ప్రముఖ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
సెప్టెంబరు 22న హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సుమారు 50వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. ప్రముఖ ఐటీ సంస్థ ఎక్స్‌పీడియన్ సీఈవో జితేన్ అగర్వాల్ ఈ సభ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. హోస్టల్ లో ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ జరగక పోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే... మోదీ సభకు ట్రంప్ రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో... మరోసారి అధికారంలోకి రావాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐల మద్దతు కోసమే ట్రంప్... హౌడీ మోదీ సభకు రావాలని అనుకుంటున్నారనే అనుమానం వ్యక్తమౌతోంది.