లండన్ లో 'దశాబ్ది దగా సమాలోచన'.. తెలంగాణ 9 ఏండ్ల పాలనపై శ్వేతపత్రం విడుదలకు కాంగ్రెస్ డిమాండ్

London: 9 ఏండ్ల కు దశాబ్ది  ఉత్సవాల పేరిట,  తెలంగాణ‌ప్రభుత్వ ధనంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకోవడం శోచనీయమనీ,  గత  9 ఏండ్ల లో విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ కల్పన.. ఇలా అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేద‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ ఆరోపించింది. కాంగ్రెస్ నాటిన  విత్తనాల  ఫలితాలే  కాల క్రమేణా పెరిగిన  అభివృద్ధి పై కేసీఆర్ తన పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమ‌ర్శించింది.
 

Dasabdi Daga Program in London, Congress demands release of white paper on Telangana's 9-year rule

'Dasabdi Daga Program' in London: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు లండన్ లో టీపీసీసీ ఎన్నారై సెల్  ఆధ్వర్యంలో "దశాబ్ధి దగా సమాలోచన" కార్యక్రమం నిర్వహించారు. చ‌ర్చా వేదికలో 9 ఏండ్ల పాలన లో వివిధ రంగాల్లో కేటాయించిన నిధులు, ఖర్చుల పై  శ్వేతపత్రం విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9 ఏండ్ల కు దశాబ్ది  ఉత్సవాల పేరిట, తెలంగాణ‌ప్రభుత్వ ధనంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకోవడం శోచనీయమనీ, గత 9 ఏండ్ల లో విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ కల్పన.. ఇలా అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేద‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ ఆరోపించింది. కాంగ్రెస్ నాటిన  విత్తనాల ఫలితాలే  కాల క్రమేణా పెరిగిన  అభివృద్ధి పై కేసీఆర్ తన పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమ‌ర్శించింది.

2014 తెరాస మేనిఫెస్టోలో ఎన్నారై సెల్ ఏర్పాటు చేసి, రూ. 500 కోట్ల నిధులతో  గల్ఫ్ బాధితులకు బాసటగా ఉంటామని  నమ్మబలికి, నేడు 9 ఏండ్లకు కూడా ఎలాంటి చర్యలకు ఉపాక్రమించలేదని, ఇదే కేసీఆర్ దశాబ్ది దగకు చక్కని ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే, 2014 లో అధికారం లోకి వచ్చిన 3 నెలల్లోనే ముస్లిం మైనారిటీ వర్గాలకు 4% ఉన్న రిజర్వేషన్ల‌ను 12% చేస్తామని చెప్పి 9 సంవ‌త్స‌రాలుగా నీరు గార్చి దగా చేసిన మరో ఉదాహరణ పేర్కొన్నారు. కేజీ టూ పీజీ అంటూ అధికారంలోకి ఈ 9 ఏండ్ల లో కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థ ని ధ్వంసం చేశారని విమ‌ర్శించారు. ప్రభుత్వ బడుల్లో నియామకాలు లేవు, ఖాళీలు భర్తీలు లేవు, ప్రాధమిక విద్య దాదాపు పూర్తిగా ప్రయివేటుపరం చేశారు. ఇంటర్ మార్కుల్లో గోల్మాల్, వివిధ ఎంట్రెన్స్ లలో ప్రశ్న పత్రాల లీకేజ్, యూనివర్సిటీలలో ఖాళీల భర్తీ చేయకపోవడం, ప్రయివేటు యూనివర్సిటీ లు ఏర్పాటు చేయడం, ఐఐఐటీలో కూడా విద్యార్థుల ఆత్మ హత్యలు.. ఇలా పూర్తి విద్యా వ్యవస్థ ని ధ్వంసం చేసి దగా చేశార‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ పేర్కొన్నారు.

ధర్నాచౌక్ ఎత్తి వేత, ఉద్యోగ నేతల అరెస్ట్, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత పై నిరసన కార్యక్రమాల పై ఉక్కుపాదంతో అణిచివేత, రైతులకు బేడీలు, తమ ప్రజా విధానాలని  ఎత్తి చూపుతున్న జర్నలిస్ట్ లపై దౌర్జన్యం, వేధింపులు, అణిచివేతలు కొన‌సాగుతుండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఇలా ఈ  9 ఏండ్ల పాలన లో ఎన్నో ఏండ్ల కల తెలంగాణ వస్తే సాకారం అవుతుందని  భావించిన  ప్రజలు  అన్ని రంగాలలో ద‌గాకు గుర‌య్యార‌ని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, వివిధ పంటలకు  మద్దతు ధర ఇవ్వకుండా, కల్తీ విత్తనాలు అరికట్టడం లో విఫలమై, ఎరువులు, ఫెస్టిసైడ్ ధరలు నియంత్రణ చేయకుండా, రైతు బంధు పేరుతో  దగా చేస్తూ, రైతులకు వ్యవసాయం ద్వారా రాబడి, లాభాల్లో  వాటా తగ్గే విధంగా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు  ఉన్నాయని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ పాలనకు ముగింపు పలికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో సామాజిక న్యాయాన్ని పొంది, సమూలాభివృద్ధి  పొందుతామనే  ఆశాభావం వ్యక్తం చేశారు.  టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్, కో కన్వీనర్ రంగుల సుధాకర్, కార్యదర్శి నీలా శ్రీధర్, మహిళా విభాగం కో ఆర్డినేటర్ మేరీ, సయ్యద్ అక్బర్ హుస్సేన్, శీలం శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ గౌడ్ మరుపల్లి, గంగం మధుకర్ రెడ్డి, జవ్వద్ అయాన్, నరేష్ కుమార్, ఆదర్శ రెడ్డి, జవహర్ రెడ్డి,మధుకర్ అలవల,రోహిత్ రెడ్డి చందుపట్ల, సాయినాథ్  తదితర 22 మంది ఎగ్జిక్యూటివ్ మెంబెర్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios