కరోనా సోకి.. రెండు నెలలు కోమాలో ఉన్న డాక్టర్...!
ఆమెకు కరోనా సోకిన తర్వాత దాదాపు రెండు నెలలు కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె తిరిగి బతుకుతుందని డాక్టర్లు కూడా విశ్వసించలేదు. కానీ.. ఆమె విషయంలో మిరాకిల్ జరిగింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతాలకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా మన దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా... మన దేశానికి చెందిన ఓ వైద్యురాలు మాత్రం.. యూకేలో కరోనాని జయించింది. ఆమె కరోనా నుంచి బయటపడటం.. అందరూ అద్భుతంగా చెబుతుండటం గమనార్హం. ఎందుకంటే.. ఆమెకు కరోనా సోకిన తర్వాత దాదాపు రెండు నెలలు కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె తిరిగి బతుకుతుందని డాక్టర్లు కూడా విశ్వసించలేదు. కానీ.. ఆమె విషయంలో మిరాకిల్ జరిగింది. నవ్వుతూ ఆమె బయటకు వచ్చింది. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ కి చెందిన అనుష గుప్తా(40) కుటుంబం యూకేలో స్థిరపడింది. ఆమెకు అక్కడ కరోనా సోకగా.. ఆ తర్వాత పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయారు. కోమాలోకి వెళ్లిన ఆమెకు వైద్యులు నిత్యం.. వైద్యం అందిస్తూనే ఉన్నారు. దాదాపు రెండు నెలలు కోమాలోనే ఉండిపోయింది. మొత్తంగా ఆమె 150 రోజులు ఆస్పత్రి బెడ్ మీదే గడిపింది.
తాను ప్రాణాలతో తిరిగి రావడంతో తన కుటుంబం, భర్త చాలా ఆనందంగా ఉన్నారని.. ఇది తన జీవితంలో జరిగిన మిరాకిల్ అని అనూష గుప్తా వివరించారు. తాను ఐసీయూలో చేరినప్పుడు.. తనను వెంటిలేటర్ పై ఉంచారని నర్స్ చెప్పిందనది ఆ విషయం తనకు ఇంకా గుర్తుందని ఆమె పేర్కొన్నారు. తాను ఆస్పత్రిలో చేరినప్పుడు తన కుమార్తె వయసు 18 నెలలు అని.. వాట్సాప్ లో వీడియో కాల్ చేసి.. నా కూతురిని చూసానని ఆమె వివరించారు. తన కుటుంబం మద్దతు కారణంగానే ఇప్పుడు తాను జీవించి ఉన్నానని ఆమె వివరించారు.