లండన్: ఎమిరేట్స్, ఇత్హెద్  ఎయిర్  లైన్స్  ల  నిర్లక్ష్యం,  భారత్  విమాన  రాకపోకల  రద్దు  కారణం గా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్   రాష్ట్రాలకు  సంబంధించి  45 మంది  విద్యార్థులు  లండన్ లో  చిక్కుకున్నారు.  వారిలో  ఎవ్వరికి  ఇప్పుడు  ఇల్లు  లేదు,  భోజనం  లేదు. చివరికి  ఇండియన్  హై  కమిషన్  లో  ఉండగా  తెలంగాణ  ఎన్నారై  ఫోరమ్  వారిని  కలిసి  భరోసా  ఇచ్చింది . 

కొందరికి  హోటల్  లో  ఉండేందుకు  వసతి , భోజనం  సౌకర్యం  కల్పించింది.  వారాంతరం  కారణంగా అలాగే  దేశ  హోం శాఖకి  సంబంధించిన  అంశం  కావడం వల్ల  సాధ్యాసాధ్యాలు పరిశీలనకు  సమయం పట్టడంతో  వారికి  ఇబ్బందులు  తప్పడం లేదు.  ఫోరమ్  ఫౌండర్  గంప  వేణుగోపాల్  శిబిరాన్ని  సందర్శించి  అందులో  కొందరికి  హోటల్ లో  బస,  భోజనం  ఏర్పాట్లు  చేసి ధైర్యాన్ని  నింపారు.  

ఇండియన్  ఎంబసీ  ఉన్నతాధికారులతో  పరిష్కారంపై  చర్చించగా  సోమవారం  వరకు  ఏమి  చెప్పలేమని  తెలిపారు. విద్యార్థులకు  ఉండేందుకు వసతి, భోజనం  ఏర్పాటు  చేస్తామని చెప్పినా కూడా  ఒప్పుకోవడం లేదు  హై  కమిషన్ లోనే  ఉంటామన్నారు.  కొందరిని  ఒప్పించి  హోటల్లో  చేర్పించడం  జరిగింది. పరిష్కారం కోసం మంత్రి  హరీష్  రావును  సంప్రదించినట్లు గంప వేణుగోపాల్ చెప్పారు.  వారికి  అండగా తాము ఉన్నామని, విద్యార్థుల  తల్లిదండ్రులు ఏ విధమైన  బెంగ  పెట్టుకోవద్దని  భరోసా ఇచ్చారు.   

 విద్యార్థులకు  అండగా  ఉంటుందని  వారి  కుటుంబ  సభ్యులు   దైర్యం గా  ఉండాలని  సంఘ ప్రతినిధులు  గంప  వేణుగోపాల్, ప్రవీణ్  రెడ్డీ,  రంగు  వెంకట్, సుధాకర్  గౌడ్, మహేష్  జమ్ముల, ఆకుల  వెంకట్,  మహేష్  చట్ల,  నర్సింహా రెడ్డీ, స్వామి  ఆశ,  అశోక్  మేడిశెట్టి, రవి  కూర సంయుక్త  ప్రకటనలో  తెలిపారు.