అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడిన సాయుధులైన ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

దుండగుల కాల్పుల్లో ఒక విద్యార్ధి మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలను చుట్టుముట్టి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

కాల్పులకు పాల్పడింది తోటి విద్యార్ధులే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.