అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను సుష్మగా గుర్తించారు. మృతురాలు డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

భరత్ అనే యువకుడితో సుష్మాకు ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ వీరిద్దరి వివాహం చిత్తూరులో జరగాల్సి వుంది. భరత్ కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో పెళ్లి రద్దయ్యింది.

దీనిపై మూడు రోజులుగా తీవ్ర మనస్తాపంలో వున్న సుష్మ.. ఇవాళ బలవన్మరణానికి పాల్పడింది. రెండు రోజుల్లో సుష్మ మృతదేహం భారత్‌కు రానుంది. కుమార్తె మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సుష్మ కుటుంబ సభ్యులు.. భరత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.