అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం మిరియంగంగపల్లెకు చెందిన ప్రత్తిపాటి వివేక్ బెంగళూరులో బీటెక్ పూర్తి చేశాడు.

అనంతరం ఎమ్మెస్ చదివేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే షర్లోటేలోని ఓ పెట్రెల్ బంకులో పార్ట్‌టైం వర్క్ చేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అతనిని ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు.

వివేక్ మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతని మృతదేహాన్ని బుధవారం భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.