ఐక్య రాజ్య సమితిలో చంద్రబాబు ప్రసంగం.. శ్రద్ధగా విన్న ప్రపంచ ప్రతినిధులు
ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్ధిక వేదిక-బ్లూంబెర్గ్ నిర్వహించిన ‘‘ సుస్ధిర అభివృద్ధి-ప్రభావం’’ అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్ధిక వేదిక-బ్లూంబెర్గ్ నిర్వహించిన ‘‘ సుస్ధిర అభివృద్ధి-ప్రభావం’’ అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా.. 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలని ఏపీ లక్ష్యాలను పెట్టుకుందని తెలిపారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు.
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శమన్నారు. త్వరలోనే రాష్ట్రమంతా ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తామని.. ఎరువులు, పురుగు మందులు లేకుండా కూడా వ్యవసాయం సాధ్యమేనని సీఎం పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో జీవన ప్రమాణాలు పెరుగుతాయని.. ప్రస్తుతం భారత్‌లో సగటు జీవనకాలం 70 ఏళ్లని.. అయితే ప్రకృతి వ్యవసాయంతో 100 ఏళ్లు బతకొచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలు జీవన ప్రమాణాలను పెంచడమే మా లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రపంచమంతా అమలు చేయాలని ఆయన సూచించారు. ఏపీలో పర్యటించి మా వ్యవసాయాన్ని చూడాలని చంద్రబాబు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. సాంకేతికతను జోడిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని.. న్యూయార్క్‌లో ఉండి ఏపీలో వీధిలైట్లను మానిటర్ చేయగలనని.. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో ఏపీ నెంబర్‌వన్ ముఖ్యమంత్రి అన్నారు.