శవమై తేలిన తెలంగాణ బిజెపి నేత కుమారుడు
ఉజ్వల్ లండన్ లోని క్వీన్ మేరీ యూనివర్శిటీలో టెక్ సంబంధితమైన మాస్టర్స్ డిగ్రీ కోర్టు చేస్తున్నాడు. అతను చివరి సారి తల్లిదండ్రులోత ఆగస్టు 21వ తేదీన మాట్లాడాడు.
లండన్: ఇంగ్లాండులో గత కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన తెలంగాణ బిజెపి నేత కుమారుడు శవమై తేలాడు. ఉజ్వల్ శ్రీహర్ష సన్నే అనే ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ కుమారుడు కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.
అతని కోసం పెద్ద యెత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇంగ్లాండులోని సూసైడ్ స్పాట్ అయిన ఈస్ట్ ససెక్స్ కంట్రీలోని బీచీ హెడ్ లో ఆదివారం అతని శవం కనిపించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ శవం కనిపించింది. అది 24 ఏళ్ల ఉజ్వల్ సన్నేదిగా అనుమానిస్తున్నట్లు ససెక్స్ పోలీసు అధికారి ప్రతినిధి మంగళవార తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబానికి తెలియజేసినట్లు చెప్పారు.
ఉజ్వల్ లండన్ లోని క్వీన్ మేరీ యూనివర్శిటీలో టెక్ సంబంధితమైన మాస్టర్స్ డిగ్రీ కోర్టు చేస్తున్నాడు. అతను చివరి సారి తల్లిదండ్రులోత ఆగస్టు 21వ తేదీన మాట్లాడాడు.