Asianet News TeluguAsianet News Telugu

అమెరికా: నీ రంగు నాలాగా లేదంటూ వ్యాఖ్యలు.. సుత్తితో సిక్కు యువకుడిపై దాడి

అమెరికాలో ఆసియా సంతతి ప్రజలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని ఒక హోటల్‌లో సుమిత్‌ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడిపై ఓ నల్లజాతీయుడు సుత్తితో దాడిచేశాడు. ‘‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. నీ శరీరరంగు నాలాగా లేదు’’ అంటూ నిందితుడు నినాదాలు చేశాడు.

black man attacks sikh with hammer in us KSP
Author
Washington D.C., First Published May 4, 2021, 3:02 PM IST

అమెరికాలో ఆసియా సంతతి ప్రజలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని ఒక హోటల్‌లో సుమిత్‌ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడిపై ఓ నల్లజాతీయుడు సుత్తితో దాడిచేశాడు. ‘‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. నీ శరీరరంగు నాలాగా లేదు’’ అంటూ నిందితుడు నినాదాలు చేశాడు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి. ఏప్రిల్‌ 26వ తేదీన బ్రౌన్స్‌విల్లేలో తాను పనిచేస్తున్న ‘‘ది క్వాలిటీ ఇన్‌ హోటల్‌లో ఒక నల్లజాతీయుడు వచ్చాడని సుమిత్ తెలిపాడు. అతడు లాబీలోకి చేరి పెద్దపెద్దగా కేకలు వేశాడని.. అక్కడి రిసెప్షనిస్టు ఏమి కావాలని అతడిని ప్రశ్నించిందని చెప్పాడు.

గొడవ పెద్దది కావడంతో తాను వెళ్లి అతనితో మాట్లాడానని.. కానీ, ప్రయోజనం లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని పిలిచినట్లు సుమిత్ వెల్లడించాడు. అదే సమయంలో అతడు కోపంతో రగిలిపోతూ జేబులో చేతులుపెట్టుకొని వేగంగా తనవైపు పరిగెత్తుకొచ్చాడని అయితే అతడి వద్ద తుపాకీ ఉందని తాను భయపడ్డానని పేర్కొన్నాడు.

అతనిని సముదాయించేందుకు గాను నువ్వు నా సోదరుడివని చెప్పానని... కానీ, ‘నీ చర్మం రంగు నా చర్మం రంగు వేరు.. ’ అంటూ వ్యాఖ్యానించాడని పేర్కొన్నాడు. ఆ వెంటనే జేబులో నుంచి సుత్తి బయటకు తీసి తన తలపై దాడి చేశాడని సుమిత్ తన ఫిర్యాదులో తెలిపాడు.

ఈ ఘటనపై భయంతో తొలుత ఫిర్యాదు చేయకుండానే సుమిత్‌ ఇంటకి వెళ్లిపోయాడు. అయితే ఆరోజు రాత్రి నొప్పి పెరగడంతో నిద్రపట్టలేదు. డాక్టర్‌ వద్దకు చికిత్స తీసుకొని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సుమిత్‌కు ఓ సిక్కు సంస్థ న్యాయసహాయం అందిస్తానని పేర్కొంది. కాగా, ఆసియా అమెరికన్లపై దాడులను నివారించేంాదుకు గాను రూపొందించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios