బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు..
అలాగే అధ్యక్ష సిబ్బంది కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ గా గౌతమ్ రాఘవన్ ను బైడెన్ నియమించారు. రాఘవన్ గతంలో వైట్‌హౌస్ లో సేవలందించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్ కి చోటు దక్కింది. తన ప్రసంగ రచయితగా వినయ్ రెడ్డిని బైడెన్ నియమించారు. బైడెన్ వినయ్ రెడ్డి దీర్ఘకాలం సహాయకుడిగా పనిచేశారు.
అలాగే అధ్యక్ష సిబ్బంది కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ గా గౌతమ్ రాఘవన్ ను బైడెన్ నియమించారు. రాఘవన్ గతంలో వైట్‌హౌస్ లో సేవలందించారు. వారితో పాటు నిర్వహణ, పరిపాలన డైరెక్టర్‌గా అన్నె ఫిలిపిక్, షెడ్యూలింగ్ అండ్ అడ్వాన్స్ (బైడెన్ కార్యక్రమాలను ఖరారుచేసే బాధ్యత) డైరెక్టర్‌గా ర్యాన్ మోంటోయా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బ్రూస్ రీడ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు సీనియర్ సలహాదారుగా ఎలిజబెత్ విల్కిన్స్‌లను బైడెన్, కమలా హారిస్ నియమించారు.
కాగా.. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బోనాల్డ్ ట్రంప్ ఘోర ఓటమిని చవిచూశారు. జో బైడెన్ త్వరలోనే అధికార బాధ్యతలు చేపట్టనున్నారు.