ఎన్నారైలంతా కాంగ్రెస్‌ పక్షాన నిలబడాలి.. లండన్‌లో భట్టీ విక్రమార్క

First Published 7, Oct 2018, 5:50 PM IST
bhatti vikramarka comments in landon
Highlights

రాబోయే ఎన్నికల్లో ఎన్నారైలంతా కాంగ్రెస్ పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు టీపీసీసీ నేత, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టీ విక్రమార్క. లండన్ పర్యాటనలో ఉన్న ఆయన పలువురు ఎన్నారైలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా విక్రమార్క సమక్షంలో కొందరు ఎన్నారైలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన నిలబడి టీఆర్ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు.

ఇదే కార్యక్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎన్నారైలు కాంగ్రెస్‌లో చేరిక.. పార్టీలో నూతనొత్సాహం నింపారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్, శ్రీధర్ నీలా, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
loader