న్యూఢిల్లీ: ఓ వలసదారుడు భారతదేశానికి చెందిన భార్యాభర్తలపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో భర్త మరణించగా, భార్య గాయపడింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం ఈ విషయం చెప్పారు. 

మునిచ్ సమీపంలో ప్రశాంత్, స్మిత బసరూరు దంపతులపై ఓ వలసదారుడు దాడి చేశాడని, దురదృష్టవశాత్తు ప్రశాంత్ మరణించాడని, గాయపడిన స్మిత ఆరోగ్యం నిలకడగా ఉందని సుష్మా స్వరాజ్ చెప్పారు.

ప్రశాంత్ సోదరుడు జర్మనీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

దంపతులకు ఇద్దరు పిల్లలున్నారని, వారి యోగక్షేమాలు చూడాలని తమ అధికారులను ఆదేశించామని చెప్పారు.