Asianet News TeluguAsianet News Telugu

కెనడాలో తెలుగు విద్యార్ధి మృతి: మృతదేహం కోసం ఫ్యామిలీ ఎదురు చూపులు

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజారెడ్డి ప్రమాదవశాత్తు  కెనడాలో మరణించాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 
 

Andhra pradesh student teja Reddy dies in canada
Author
East Godavari, First Published Jul 30, 2020, 1:02 PM IST

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజారెడ్డి ప్రమాదవశాత్తు  కెనడాలో మరణించాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

ఉన్నత విద్య కోసం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజా రెడ్డి 2018లో కెనడాకు వెళ్లాడు. ఈ నెల 29వ తేదీన ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ సమాచారాన్ని తేజా రెడ్డి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కెనడా ఆసుపత్రి మార్చురీలో యువకుడి మృతదేహాన్ని భద్రపర్చారు.

ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కెనడా ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని తేజా రెడ్డి స్నేహితులు కోరుతున్నారు.

ఉన్నత చదువులతో స్వదేశానికి తిరిగి వస్తాడని భావించిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కొడుకు మృతదేహన్ని రప్పించేందుకు ఆ కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లన పలువురు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తు మరణించారు. మృతదేహలను స్వగ్రామాలకు రప్పించుకొనేందుకు కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడేవారు. 

Follow Us:
Download App:
  • android
  • ios