మలేషియాలో గాజువాకవాసి మృతి...మృతదేహం తరలించడానికి అడ్డంకులు

ఉపాధికోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు కార్మికుడు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ గాజువాకకు చెందిన  సూర్యనారాయణ అనే వ్యక్తి ఏడాది క్రితం మలేషియాకు వెళ్లాడు. అక్కడ  ఓ కంపనీలో వెల్డర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవలే అతడి  వీసా  గడువు ముగియడంతో సదరు కంపనీ అతన్ని  స్వదేశానికి వెళ్లిపోవాల్సింది ఆదేశిస్తూ పనిలోంచి  తీసేసింది. 

andhra pradesh person death at malaysia

ఉపాధికోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు కార్మికుడు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ గాజువాకకు చెందిన  సూర్యనారాయణ అనే వ్యక్తి ఏడాది క్రితం మలేషియాకు వెళ్లాడు. అక్కడ  ఓ కంపనీలో వెల్డర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవలే అతడి  వీసా  గడువు ముగియడంతో సదరు కంపనీ అతన్ని  స్వదేశానికి వెళ్లిపోవాల్సింది ఆదేశిస్తూ పనిలోంచి  తీసేసింది. 

అయితే ఇక్కడికి వస్తే మళ్లీ ఆర్థిక  కష్టాలు తప్పవని భావించిన అతడు అక్కడే మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది.  తాను నివాసముండే  గదిలోని బాత్  రూంలో కాలుజారి పడిపోయిన సూర్యనారాయణ మృతిచెందాడు. ఈ విషయాన్ని అదే గదిలో నివాసముండే మరో వ్యక్తి గమనించి అక్కడి పోలీసులతో పాటు గాజువాకలో వున్న అతడి కుటుంబానికి  సమాచారం అందించాడు.

అయితే వీసా గడువు ముగిసినా ఇంకా  అక్కడే  వున్న సూర్యనారాయణ మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వమే చొరవ తీసుకుని మృతదేహం వచ్చేలా సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

ఈ మరణవార్త  తెలుసుకున్న సూర్యనారాయణ భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త రెండు రోజుల క్రితమే తనకు ఫోన్ చేశాడని...మరో రెండు, మూడు రోజుల్లో ఇక్కడికి వస్తానని చెప్పాడని తెలిపింది. అంతలోనే ఆయన మరణవార్త వినాల్సివస్తోందంటూ ఆమె విలపించారు. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios