అమెరికాలో తాత, మామలను హత్య చేసిన కేసులో 23 ఏళ్ల భారతీయ విద్యార్థి అరెస్ట్
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు తన తాత కుటుంబాన్నే హత్య చేశాడు. తాతా, అమ్మమ్మలతో పాటు మామను కాల్చాడు
అమెరికా : ఓ 23 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలో దారుణానికి పాల్పడ్డాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన అమ్మమ్మ,తాతయ్యలతో పాటు అంకుల్ కుటుంబాన్ని కాల్చి చంపాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్ మెంట్ లో ఈ హత్యలు జరిగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి, హత్య అభియోగాలు మోపినట్లు పోలీసులు, యూఎస్ మీడియా నివేదికలు తెలిపాయి.
ఓం బ్రహ్మ్‌భట్ అనే ఆ విద్యార్థి దిలీప్‌కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72), యష్‌కుమార్ బ్రహ్మభట్ (38)లను కాల్చిచంపారని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీసు విభాగం, మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లోని న్యూ డర్హామ్ రోడ్‌లోని ఓ ఇంట్లో హత్యలు జరిగినట్లు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ అధికారులు ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు కనుగొన్నారు. వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరు తుపాకీతో కాల్చడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు.
పాక్‌లో వెంటిలేటర్‌పై 26/11 దాడుల సూత్రదారి సాజిద్ మీర్ .. విష ప్రయోగం అనుమానాలు, ఐఎస్ఐ పనేనా..?
రెండో అంతస్తులో ఉన్న అపార్ట్‌మెంట్‌లో దిలీప్‌కుమార్, బిందు బ్రహ్మభట్ చనిపోయి ఉండగా, మరో గదిలో కుమారుడు యష్‌కుమార్ బ్రహ్మభట్‌కు కూడా తుపాకీ గాయాలతో ఉండడం గుర్తించారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ అతను మరణించాడు.
సంఘటనా స్థలంలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం కేసు నమోదు చేశారు. ఓమ్‌పై ఫస్ట్-డిగ్రీ మర్డర్, సెకండ్-డిగ్రీ.. ఆయుధాలను కలిగి ఉండడంతో పాటు మూడు అభియోగాలు మోపారు. గుజరాత్‌కు చెందిన ఓం, బాధితులతో కలిసి ఉంటున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఇంట్లోనే కనిపించాడు.
ఓం న్యూజెర్సీకి వెళ్లి రెండు నెలలే అవుతోంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తుపాకీతో నేరం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం కోర్టుకు హాజరైన సమయంలో ఓం ప్రశాంతంగా కనిపించాడు. ఆ రోజు ఉదయం 911కి కాల్ చేసింది అతనేనని తేలింది. పోలీసులకు ఫోన్ ఎవరు చేశారనే విషయాన్ని అడిగితే, "అది నేనే కావచ్చు" అని ఓం చెప్పాడని అధికారులు చెప్పారు.
కాల్పులకు దారితీసిన విషయం స్పష్టంగా తెలియరాలేదు. వారి పక్కింటి వ్యక్తి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇలా జరగడం ఇదేం మొదటిది కాదు. కానీ ఈ ఘటన నాకు గగుర్పాటు కలిగించింది అన్నారు. మృతుల కుటుంబం గురించి తనకు తెలియదని, పరిచయం లేదని అన్నారు.
భారత్ నుండి వలస వచ్చిన అనేక కుటుంబాలు ఈ ట్రెడిషన్స్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటాయి. విచారణలో వారు సహకరిస్తారని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన హింస కాదని నిర్ధారించారని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.