ఫర్మింగ్టన్ ఫేక్ యూనిర్శిటీ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కాగా.. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అక్కడి తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణకు చెందిన 8మంది విద్యార్థులను రక్షించేందుకు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆట తెలంగాణ) ప్రత్యేకంగా అటార్నీ ఏర్పాటు చేసింది.

కాగా..ఈ 8మంది విద్యార్థుల కేసును యూఎస్ మిషిగల్ ఫెడరల్ కోర్టులో విచారణకు స్వీకరించారు. విద్యార్థుల తరపున అటార్నీ ఎడ్వర్డ్ జజుకా మొదటిరోజు వాదనలు వినిపించారు. ఈ కేసుకుసంబంధించిన పూర్తి వివరాలను ఎడ్వర్డ్ బజుకా..తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి వెంకట్ మంతెనకు వివరించారు. 8 మంది తెలుగు విద్యార్థుల తరపున తాము వాదిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు  ట్రయల్ ప్రారంభమయ్యిందని చెప్పారు.వీలైనంత తొందరగా విద్యార్థుల విడుదలయ్యేలా ప్రయత్నిస్తున్నామననారు.

ట్రయల్ పూర్తయ్యేంత వరకు తెలుగు విద్యార్థులను ఫెడరల్ కటస్టడీలోనే ఉంచాలని వాదిస్తున్నట్లు చెప్పారు. ఆమేరకు జడ్జీని కోరామని చెప్పారు. లేదంటే వారు బేయిల్ పై విడుదలైతే యూఎస్ ఐస్(US ICE-united states immigration and customs enfoce) అరెస్ట్ చేసే అవాకాశం ఉందని ఆయన అన్నారు.అదే జరిగితే వారి యూఎస్ ఐస్ వద్ద కస్టడీ శిక్షకిందకు రాదని చెప్పారు. 

అదే ఫెడరల్ కస్టడీలో ఉంటే ఒకవేళ శిక్ష పడితే.. ఫెడరల్ కస్టడీలో ఉన్న రోజులను శిక్షకాలం నుంచి మినహాయింపు వస్తుందని వివరించారు.ఇక D3( డిఫెండెంట్) గా ఉన్న విద్యార్థి ఫణీంధ్ర కర్ణాటికి బేయిల్ వచ్చిందని.. కాకపోతే అతన్ని ఐస్ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ఎందుకుంటే అతనికి హెచ్1 వీసా ఉందని చెప్పారు.ప్రభుత్వం విద్యార్థుల అరెస్టు సమయంలో సీజ్ చేసిన సమయంలో చాలా  ఫైల్స్, ఫోన్ కాల్ లిస్ట్ , డేటా సేకరించిందని చెప్పారు. 

ఆ డెటా  తమకు వచ్చిందని..ఆ డేటా చాలా పెద్ద మొత్తంలో ఉందని వాటిని పరిశీలించేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. విచారణలో చాలా కాన్ఫిడెన్షియల్ విషయాలు ఉన్నాయన్నారు. వాటిని చెప్పలేమననారు. నెక్ట్స్ ట్రయల్ ఎప్పుడు ఉండేది కూడా న్యాయమూర్తి నిర్ణయంమేరకే ఉంటుందని చెప్పారు. 

అనంతరం వెంకట్ మంతెన మాట్లాడుతూ...డిటెన్షన్ సెంటర్ లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల న్యాయ సహాయం కోసం కృషిచేస్తున్నామన్నారు.తమ సంస్థ తరపున ఎడ్వర్డ్ బజూక నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించామని చెప్పారు.మిషిగన్ ఫెడరల్ కోర్టులో సోమవారం ట్రయల్ జరిగిందన్నారు.

విద్యార్థులు సాధ్యమైనంత త్వరగా విడుగలయ్యేలా ఎడ్వర్డ్ బజూకా నేతృత్వంలోని బృంధం వాధనలు వినిపించారని చెప్పారు. విద్యార్థలకు యూఎస్ ఐస్ కస్టడీలోకి తీసుకోకుండా  ఫెడరల్ కస్టడీలో కొనసాగించాలని వాదనలు జరిగాయన్నారు. D3(డిఫెండెంట్) గా ఉన్న ఫణీంధ్ర కర్ణాటి అనే విద్యార్ధికి బేయిల్ రావటం శుభసూచకమన్నారు.

వచ్చే వారం సెకండ్ ట్రయల్ ఉండే అవకాశం ఉందని.. అందులో మిగిలిన తెలుగు విద్యార్థులకు సానుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. తెలుగు విద్యార్థులకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్( ఆట-తెలంగాణ) పక్షాన అందిస్తున్నామని చెప్పారు.

"