Asianet News TeluguAsianet News Telugu

8 లక్షల మంది భారతీయులకు కువైట్ షాక్

తమ దేశంలో భారతీయులకు కువైట్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.ప్రవాసీలను దాదాపు 30 శాతం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కువైట్ ప్రభుత్వం ఆ బిల్లను రూపొందించింది.

8 lakh Indians may have to leave as Kuwait approves a Draft expat quota bill
Author
kuwait, First Published Jul 6, 2020, 3:36 PM IST

కువైట్: తమ దేశంలోని భారతీయులకు కువైట్ షాక్ ఇచ్చింది. దేశంలోని ప్రవాసీలను సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రవాసీలను దాదాపు 30 శాతం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కువైట్ ప్రభుత్వం ఆ బిల్లను రూపొందించింది. 

ఆ బిల్లు చట్టంగా మారితే అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనక్కి రావాల్సి ఉంటుంది. కువైట్ లో కరోనై వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులను వెనక్కి పంపాలని స్థానిక అధికారులు, నాయకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 

దాంతో ప్రస్తుతం ఉన్న 70 శాతం ప్రవాసీలను 30 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేసింది. కువైట్ ప్రధాని షేక్ సబా ఆల్- ఖలీద్ అల్ - సబా ఆ ముసాయిదా బిల్లును ప్రతిపాదించినట్లు కువైట్ మీడియా తెలిపింది. 

ఈ బిల్లు ప్రకారం కువైట్ లో భారతీయుల సంఖ్య 15 శాతానికి మించకూడదు. దాదాపు 43 లక్షల జనాభా గల కువైట్ లో వివిధ దేశాల నుంచి వ్చిచనవారి సంఖ్య 30 లక్షలు ఉంటుంది. వారిలో అత్యధికంగా 14 లక్షల మంది భారతీయులే ఉన్నారు. 

కువైట్ లోని భారత ఎంబసీ లెక్కల ప్రకారం... కువైట్ ప్రభుత్వంలో నర్సులు, ఇంజనీర్లు వంటి ఉద్యోగాల్లో, శాస్త్రవేత్తలుగా, ఆయిల్ కంపెనీ ఉద్యోగాల్లో 28 వేల మంది పనిచేస్తున్నారు. దాదాపు 5.63 లక్షల మంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. 1.16 లక్షల మంది డిపెండెంట్స్ ఉన్నారు. దేశంలోని 23 భారతీయ విద్యాసంస్థల్లో 60 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. 

ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాలిస్తే దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం కువైట్ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆ ముసాయిదా బిల్లును తదుపరి ప్రణాళిక, మార్గదర్శకాలను రూపొందించడానికి మరో కమిటీకీ పంపించింది. కాగా కువైట్ లో 49 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios